సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ: మార్కాపురం జిల్లాలో భారీ వాహన చోరీ ముఠా గుట్టురట్టు!

ఎటువంటి శ్రమ లేకుండా సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో వాహన చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను బెస్తవారిపేట పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు.

ఆదివారం మార్కాపురం డిఎస్పీ నాగరాజు వెల్లడించిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లాకు చెందిన గంగాధర్ రావు, కడప జిల్లాకు చెందిన ప్రసాద్ అనే నిందితులు కొంతకాలంగా మార్కాపురం పరిసర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. గత కొన్ని నెలల క్రితం గిద్దలూరులో ఒక టాటా ఇంట్రా వాహనాన్ని, బెస్తవారిపేటలో ఒక ట్రాక్టర్‌తో పాటు నాలుగు ద్విచక్ర వాహనాలను అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని (CCTV మరియు మొబైల్ సిగ్నల్స్) ఉపయోగించి నిందితులను పట్టుకున్నారు. వీరి వద్ద నుండి సుమారు రూ.14 లక్షల విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోరీ కేసుల్లో సంబంధం ఉన్న ఈ నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన సీఐ రామకోటయ్య, ఎస్‌ఐ రవీంద్రారెడ్డి మరియు సిబ్బందిని డిఎస్పీ అభినందించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *