
మార్కాపురం జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
పరీక్షలు జరిగే సమయాల్లో (ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు) పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశించారు. ఇన్విజిలేటర్లు, విధుల్లో ఉన్న సిబ్బంది మినహా ఇతరులెవరినీ కేంద్రాల్లోకి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు.
మాస్ కాపీయింగ్ లేదా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ ఎస్పీ గారు శుభాకాంక్షలు (ఆల్ ది బెస్ట్) తెలియజేశారు.
