తిరుమల పుణ్యక్షేత్రంలోని ఆదిశేషు అతిథి గృహం సమీపంలో ఒక అరుదైన పచ్చనాగు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. అతిథి గృహం పక్కనే ఉన్న చెట్లపై ఈ పాము సంచరిస్తుండటాన్ని గమనించిన భక్తులు మరియు సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.
ఈ సమాచారాన్ని వెంటనే స్నేక్ క్యాచర్ (Snack Catcher)కు అందించడంతో, ఆయన చాకచక్యంగా ఆ పచ్చనాగును బంధించారు. ఎవరికీ ఎటువంటి హాని కలగకుండా సురక్షితంగా పట్టుకున్న ఆ పామును, అనంతరం అటవీశాఖ అధికారుల సమక్షంలో సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అరుదుగా కనిపించే ఈ పచ్చనాగును చూసేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు.
