ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10.30 గంటలకు పార్లమెంట్‌లోని కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించినందుకు గానూ రాష్ట్ర ప్రజల తరపున ప్రధానికి లోకేష్ ధన్యవాదాలు తెలియజేయనున్నారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *