
మార్కాపురం జిల్లా లో పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా కంభం పట్టణంలో నీ అర్బన్ ఏరియాల్లో తాగునీటి కష్టాలు వర్ణనాతీతం. నాలుగు రోజులకు ఒక్కసారి నీళ్లు వదలడం ఒక ఎత్తయితే, ఆ వచ్చే కొద్దిపాటి నీటిని కూడా పలుకుబడి ఉన్నవారు మోటార్లు పెట్టి లాగేస్తుంటే, సామాన్యుడు చుక్క నీటి కోసం రోడ్ల మీదకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆసియాలోనే అతిపెద్దదైన కంభం చెరువు కళ్లముందే ఉన్నా, గొంతు ఎండిపోతుండటం ఇక్కడి పాలనానికే సిగ్గుచేటు. ప్రజలు బిందెలు పట్టుకుని మెయిన్ రోడ్డుపై ట్యాంకర్ల వెంట పరుగులు తీస్తుంటే, సంబంధిత శాఖ అధికారులు మాత్రం చెట్ల కింద కూర్చుని కాలక్షేపం చేస్తూ సమస్యను గాలికొదిలేశారు. ఫిర్యాదు చేయడానికి వెళ్తే పట్టించుకునే నాథుడే లేడు. అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది? పుష్కలంగా నీటి వనరులు ఉన్నా ఈ కృత్రిమ కొరత వెనుక ఉన్న అసలు కారణాలేంటి? సామాన్యుడి దాహార్తిని తీర్చలేని ఈ వ్యవస్థ మారాల్సిందే, అధికారుల నిర్లక్ష్యం వీడాల్సిందే!
