
మార్కాపురం జిల్లా కంభం పట్టణంలో దసరా ఉత్సవాల సందడి ముగిసింది. ఆ నిశ్శబ్ద అర్ధరాత్రి వేళ.. పట్టణం నడిబొడ్డున మెయిన్ రోడ్డుపై జరిగిన ఒక యదార్థ సంఘటన ఇప్పుడు స్థానికులను భయంతో వణికిస్తోంది.
ఆ రాత్రి ఏం జరిగింది?
నైట్ రైడ్ ముగించుకుని, టీ తాగి సరదాగా ఇంటికి వస్తున్న ముగ్గురు మిత్రులకు.. నిర్మానుష్యంగా ఉన్న ఆ రోడ్డుపై ఒక ఊహించని దృశ్యం ఎదురైంది. కారుచీకటిలో, రోడ్డు మధ్యలో ఒక అమ్మాయి ఒంటరిగా.. అత్యంత వికృతమైన వేగంతో నాట్యం చేస్తోంది.
”అసలు ఈ టైంలో, ఇక్కడ అమ్మాయి ఏంటి?” అని ఆశ్చర్యపోయిన ఆ యువకులు.. తమ కళ్లు తమను మోసం చేస్తున్నాయేమోనని అనుమానంతో బైక్ వెనక్కి తిప్పి మళ్ళీ వచ్చి చూశారు.
కళ్ల ముందే మాయం.. మళ్ళీ ప్రత్యక్షం!
నిజమే! అదే చోట ఆ వింత రూపం గాలిలో చేతులు ఆడిస్తూ భీతిగొల్పేలా డాన్స్ చేస్తూనే ఉంది. ధైర్యం చేసి బండి ఆపి, హెడ్లైట్ ఫోకస్ వేసి దగ్గరికి వెళ్లేసరికి.. ఒక్కసారిగా ఆ రూపం గాలిలో కలిసిపోయి మాయమైపోయింది! గుండెలు పగిలే భయంతో వెనక్కి తిరగగానే.. అదే రూపం మళ్ళీ అక్కడ ప్రత్యక్షమై నాట్యం మొదలుపెట్టింది. ఇలా మూడుసార్లు కళ్ల ముందే రిపీట్ కావడంతో, ఆ యువకులకు ప్రాణ భయంతో ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఊపిరి బిగబట్టి అక్కడి నుండి ప్రాణాలతో బయటపడ్డారు.
వారం రోజుల తర్వాత బయటపడ్డ నిజం!

ఈ భయంకర అనుభవాన్ని ఎవరికైనా చెబితే నమ్ముతారో లేదో అన్న సందిగ్ధంలో ఆ యువకులు వారం రోజులుగా నలిగిపోయారు. చివరకు తమ భయాన్ని అధిగమించి, వణుకుతున్న గొంతులతో ఈ షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. కంభం మెయిన్ రోడ్డుపై ఆ అర్ధరాత్రి కనిపించిన ఆ ‘నర్తకి’ మనిషా? లేక మరేదైనా వికృత శక్తా? అన్నది ఇప్పటికీ వీడని మిస్టరీగానే మిగిలిపోయింది!
ట్విస్ట్ ఇక్కడితో అయిపోలేదు! ఆ ముగ్గురు యువకులు భయాన్ని దిగమింగుకుని మరో రోజు కూడా అదే చోటికి వెళ్లారు. ఆ రెండో రోజు వారికి ఎదురైన అనుభవం మొదటి రోజు కంటే అత్యంత భయానకమైనది! ఆ రోజు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాతి భాగం వరకు ఆగాల్సిందే!
