
నేడు మార్కెట్లో లభించే పాలలో స్వచ్ఛత తగ్గిపోతోంది. కొంతమంది స్వార్థపరులు పాల పరిమాణాన్ని పెంచడానికి మరియు పాలు పాడవకుండా ఉండటానికి యూరియా, కాస్టిక్ సోడా, డిటర్జెంట్ పౌడర్ మరియు ఫార్మాలిన్ వంటి ప్రమాదకరమైన రసాయనాలను కలుపుతున్నారు. ఇటీవల మన పొరుగు రాష్ట్రాల్లో మరియు కొన్ని తెలుగు ప్రాంతాల్లోని సరిహద్దు గ్రామాల్లో కల్తీ పాలు తాగడం వల్ల తీవ్రమై8న వాంతులు, విరేచనాలు అయ్యి, ఆసుపత్రికి వెళ్లేలోపే కొందరు ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు పాలలో వెన్న శాతం ఎక్కువగా కనిపించడానికి ‘సింథటిక్ ఆయిల్స్’ వాడటం వల్ల అవి నేరుగా గుండె మరియు జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపాయని వైద్యులు నిర్ధారించారు. ఈ రసాయనాలు మన శరీరంలోని కాలేయం (Liver), మూత్రపిండాలు (Kidneys) మరియు జీర్ణ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులపై వీటి ప్రభావం చాలా వేగంగా ఉంటుంది. మనం కొనే పాలు స్వచ్ఛమైనవో కాదో ఇంట్లోనే చిన్న చిన్న పరీక్షల ద్వారా తెలుసుకోవడం లేదా నమ్మకమైన చోట మాత్రమే పాలను సేకరించడం ఇప్పుడు మన ప్రాణాలను కాపాడుకోవడానికి చాలా అవసరం.
