News

News

​ఉత్తరప్రదేశ్‌లో కళ్లు బైర్లు కమ్మే ఓ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాలనే పెట్టుబడిగా పెట్టి, ఏకంగా రెండు వేర్వేరు ప్రభుత్వ శాఖల్లో కొలువు దీరిన ఓ వ్యక్తి.. మూడు దశాబ్దాలకు పైగా ఎవరికీ చిక్కకుండా వ్యవస్థను బురిడీ కొట్టించాడు.

బారాబంకికి చెందిన జయప్రకాష్ సింగ్ అనే వ్యక్తి, 1979లో ప్రతాప్‌గఢ్ జిల్లాలో **’నాన్ మెడికల్ అసిస్టెంట్’**గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. అయితే ఆ ఉద్యోగంలో ఉండగానే, 1993లో నకిలీ పత్రాల సాయంతో బారాబంకి జిల్లాలోనే ప్రాథమిక విద్యాశాఖలో ఉపాధ్యాయుడిగా రెండో ఉద్యోగాన్ని చేజిక్కించుకున్నాడు. ఇలా సుమారు 33 ఏళ్ల పాటు అటు వైద్య శాఖ నుండి, ఇటు విద్యా శాఖ నుండి ఒకేసారి జీతభత్యాలు, ప్రభుత్వ సౌకర్యాలు పొందుతూ రెండు పడవల మీద ప్రయాణం సాగించాడు.  ​చివరికి 2009లో ప్రభాత్ సింగ్ అనే వ్యక్తి వేసిన RTI (సమాచార హక్కు చట్టం) దరఖాస్తుతో ఈ అక్రమ సామ్రాజ్యం కుప్పకూలింది.

పోలీసుల దర్యాప్తులో జయప్రకాష్ సింగ్ చేసిన మోసం ఆధారాలతో సహా నిరూపితమైంది. ఈ సుదీర్ఘ విచారణ అనంతరం, ప్రధాన జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సుధా సింగ్ నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ.. ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 30 వేల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు వెలువరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *