Ustad-Bhagat-Singh-Release

Ustad-Bhagat-Singh-Release

మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఈ సినిమాకు ప్రత్యేకంగా బెనిఫిట్ షోతో పాటు, విడుదలైన మొదటి రోజు ఏకంగా 6 షోలు ప్రదర్శించుకోవడానికి అనుమతులు జారీ చేసింది. ఆర్థిక పరంగా కూడా చిత్ర యూనిట్‌కు బూస్ట్ ఇస్తూ, మొదటి 10 రోజుల పాటు ప్రతి టికెట్ ధరపై రూ. 100 అదనంగా పెంచుకునే వెసులుబాటు కల్పించింది.

ఇక అభిమానుల కోసం నిర్వహించే ప్రత్యేక బెనిఫిట్ షో టికెట్ ధరను రూ. 500 గా నిర్ణయించారు. మొదటి పది రోజుల హడావిడి ముగిసిన తర్వాత కూడా, మిగిలిన రోజుల్లో రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో థియేటర్ల వద్ద పవన్ ఫ్యాన్స్ సందడి రెట్టింపు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *