వారణాసిలోని పవిత్ర గంగానదిలో కొందరు యువకులు చేసిన పని తీవ్ర దుమారం రేపింది. ప్రయాణిస్తున్న పడవలో హుక్కా తాగుతూ, చికెన్ బిర్యానీ తింటూ ఎంజాయ్ చేయడమే కాకుండా, తిన్న తర్వాత మిగిలిన మాంసం ఎముకలను నేరుగా గంగానదిలో పడవేయడం హిందూ భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. గంగానదిని అత్యంత పవిత్రంగా, దైవంగా భావించే వారణాసి వంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి చర్యలు చట్టరీత్యా నేరం.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారణాసి పోలీసులు వెంటనే స్పందించారు. నది పవిత్రతను గౌరవించకుండా, మతపరమైన భావాలను కించపరిచినందుకు గాను పోలీసులు మొత్తం 14 మందిని గుర్తించి అరెస్ట్ చేశారు. పవిత్ర నదీ తీరాల్లో ఇలాంటి అగౌరవ పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *