Lines for gas

హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రం కావడంతో వినియోగదారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉదయం నుంచే వందలాది మంది ప్రజలు ఏజెన్సీ ముందు బారులు తీరి, గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ పనులు, దైనందిన కార్యకలాపాలు వదిలేసి సిలిండర్ కోసం వచ్చినప్పటికీ, స్టాక్ అందుబాటులో లేకపోవడం లేదా పంపిణీలో జరుగుతున్న ఆలస్యం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఎండలో గంటల తరబడి నిలబడలేక ఇబ్బంది పడుతుండగా, ఏజెన్సీ నిర్వాహకులు సక్రమంగా స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి, గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించి వినియోగదారుల ఇబ్బందులను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *