
మార్కాపురం జిల్లా, కంభం పట్టణంలోని అర్బన్ కాలనీలో శనివారం గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. సాధారణంగా ఒకటో తారీఖున అందజేయాల్సిన పింఛన్లు, రేపు ఆదివారం కావడంతో లబ్ధిదారులకు ఇబ్బంది కలగకూడదనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఒక రోజు ముందే పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు స్వయంగా కాలనీలో పర్యటించి, ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఎదుర్కొంటున్న నీటి సమస్య గురించి స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అక్కడే ఉన్న అధికారులను పిలిపించి ఆ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, సీనియర్ కార్యకర్తలు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
