
అసలేం జరిగిందంటే..
అనంతపురం జిల్లా ఉరవకొండలో వెలసిన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక కుటుంబంలోని ముగ్గురు అల్లుళ్లు అత్తగారింటికి వెళ్లారు. అత్తింటి వారు మర్యాదల్లో భాగంగా పెద్ద అల్లుళ్లకు కజ్జికాయలు వడ్డించి, ఏదో పొరపాటున లేదా అశ్రద్ధ వల్ల చిన్న అల్లుడికి వడ్డించలేదు. దీనిని తీవ్ర అవమానంగా భావించిన సదరు చిన్నల్లుడు, వారితో గొడవ పడకుండా ఏకంగా డయల్ 100 కి ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, పరిస్థితిని చూసి అవాక్కయ్యారు. చివరికి కానిస్టేబుల్ చొరవ తీసుకుని ముగ్గురు అల్లుళ్లకు స్వయంగా కజ్జికాయలు తినిపించి, సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
