తర్లుపాడు, ఫిబ్రవరి 23:
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం నాగేండ్ల ముడుపు గ్రామ రెవెన్యూ అధికారి (VRO) భీమనబోయిన మల్లికార్జున రావు (40) ఆదివారం రాత్రి గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో జరిగిన తన మేనమామ గృహప్రవేశ వేడుకకు హాజరై, తిరిగి స్వగ్రామానికి బయలుదేరుతుండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మల్లికార్జున మృతదేహాన్ని తర్లుపాడులోని ఆయన నివాసానికి తరలించగా, తహసిల్దార్ కేకే కిషోర్ కుమార్, తోటి విఆర్వోలు మరియు కార్యాలయ సిబ్బంది నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న వయసులోనే విధి నిర్వహణలో చురుగ్గా ఉండే అధికారి మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
