
మార్కాపురం ఏపీఎస్ ఆర్టీసీ డిపో సమీపంలో చోటుచేసుకున్న ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో అమిన్ రెహమాన్ (26) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పుల్లలచెరువు గ్రామానికి చెందిన అమిన్ రెహమాన్, మార్కాపురంలోని తన అత్తగారి ఇంటికి వచ్చి భార్యను పరామర్శించి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అతను ప్రయాణిస్తున్న బైక్‌ను ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. కళ్లముందే భర్త ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
